మరో రికార్డుకు చేరువలో పంత్!

2
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఈ నెల 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా భారీ రికార్డుపై క‌న్నేశాడు పంత్.

ప్ర‌స్తుతం టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. 103 మ్యాచ్‌ల్లో 178 ఇన్నింగ్స్‌ల్లో సెహ్వాగ్ 90 సిక్స‌ర్లు కొట్టాడు. పంత్ 46 మ్యాచ్‌ల్లో 81 ఇన్నింగ్స్‌ల్లో 88 సిక్స‌ర్లు బాదాడు. మాంచెస్టర్ టెస్టులో మరో 3 సిక్స్‌లు బాదితే భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్స‌ర్లు, రోహిత్ శ‌ర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్స‌ర్లు, రిష‌బ్ పంత్ – 45 మ్యాచ్‌ల్లో 88 సిక్స‌ర్లు, ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్స‌ర్లు, ర‌వీంద్ర జ‌డేజా – 82 మ్యాచ్‌ల్లో 72 సిక్స‌ర్లు బాదాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లలో బెన్‌స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – 133 సిక్స‌ర్లు ఉన్నాడు.

Also Read:నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు

- Advertisement -