ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. పంత్ విరోచిత సెంచరీకి తోడు హార్థిక్ రాణించడంతో రోహిత్ సేన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ విధించిన 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్…మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. పంత్ 113 బంతుల్లోనే 125 పరుగులు 16 ఫోర్లు 2 సిక్సులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
పాండ్యా 55 బంతుల్లో 71 10 ఫోర్లతో రాణించడంతో 42.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హార్దిక్ పాండ్యా (4/24), యుజ్వేంద్ర చాహల్ (3/60) ఇంగ్లీష్ జట్టును భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 60 ,ఓపెనర్ జేసన్ రాయ్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు.