Tamilnadu:డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం

4
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎఐఎడీఎంకే (AIADMK) నుంచి బహిష్కృతుడైన, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (OPS) శుక్రవారం డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పార్టీలో చేరారు.

75 ఏళ్ల పన్నీర్‌సెల్వం, మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో థేని జిల్లాలోని బోడినాయకనూరు నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముందని సమాచారం. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆయన లక్షకు పైగా ఓట్లు సాధించి గెలిచారు.

జయలలితకు సన్నిహితుడిగా పేరుగాంచిన పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పలానిస్వామితో జరిగిన అధికార పోరులో ఎఐఎడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించినప్పటికీ, పలానిస్వామి ఆయనకు పార్టీ లో స్థానం లేదని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

- Advertisement -