టీజర్‌తో దూకిన ‘పందెంకోడి-2’..

242
PandemKodi 2 Official Telugu Teaser
- Advertisement -

విశాల్‌ హీరోగా గతంలో వచ్చిన ‘పందెం కోడి’ మూవీ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌ గా ఇప్పుడు ‘పందెం కోడి 2’ రానుంది. మాస్ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా నిర్మితమైన ఈ సినిమా లింగుస్వామి డైరెక్షన్‌లో వస్తోంది.

ఈ మూవీలో విశాల్‌ కి జోడీగా కీర్తీసురేశ్‌ నటిస్తోంది. కాగా…తమిళ .. తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా.. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ రీలీజైంది.

Vishal and Keerthy Suresh ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం ఈ టీజర్ బట్టి అర్థమవుతోంది. ఈ టీజర్‌లో…దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. లవ్ .. యాక్షన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ విలనీ షేడ్ ప్రధానంగా ఈ టీజర్ కొనసాగింది. “నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు .. అడ్డుకోవడమే మొదలు పెట్టాను” .. “ఇది పులి .. మేక ఆట కాదు .. పులి – మేక కలిసి ఆడే ఆట” అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.

- Advertisement -