- Advertisement -
విశాల్-మీరా జస్మిన్ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ పందెం కోడి. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెంకోడి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్,ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి పాటను విడుదల చేసి ప్రమోషన్ కార్యక్రమాల దూకుడు పెంచారు విశాల్. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా విశాల్ ఫిలీం ఫ్యాక్టరీ,పెస్ స్టూడియోస్ బ్యానర్లపై విశాల్,ధావల్ జయంతిలాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడి విలన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుంది. శివంగి పిల్ల అంటూ సాగే ఈ పాట అందరిని అలరిస్తోంది. మీరు ఆ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.
- Advertisement -