రిసోర్స్‌ పర్సన్‌లకు కేసీఆర్‌ దిశానిర్దేశం..

244
kcr pragathi bhavan
- Advertisement -

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ పర్సన్లకు అవాగాహన కార్యక్రమం నిర్వహించారు సీఎం కేసీఆర్. కొత్తగా అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు నిధుల వినియోగం, విధుల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలపై శిక్షకులకు  దిశానిర్దేశం చేశారు.

మాస్టర్‌ ట్రైనర్లుగా శిక్షణ పొందిన అధికారులు అనంతరం జిల్లా కేంద్రంలో బృందాలుగా సర్పంచ్‌లకు  అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. 50 మంది సర్పంచ్‌లు ఒక బృందంగా మూడు విడతలుగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత సర్పంచ్‌లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే వారి గౌరవ వేతనం పెంపు నిర్ణయంతో పాటు నరేగా నిధులతో గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలో వివరించనున్నారు.

మొదటగా ఫిబ్రవరి 11నుంచి 15వ తేదీ వరకు, ఫిబ్రవరి 18 నుంచి 22వ తేదీ వరకు, 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలుంటాయని అధికారులు తెలిపారు.

- Advertisement -