అంకితభావంతో పనిచేయండి: ఎర్రబెల్లి

139
errabelli
- Advertisement -

పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సహంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాదులోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘ బాధ్యులు మంత్రిని కలిసి తమ నెలసరి వేతనం 15 వేల రూపాయల నుండి 28719 రూపాయలకు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో, అంకితభావంతో అమలు చేసి ప్రజలకు అందేలా కృషిచేయాలన్నారు. ఖజానా పై భారం పడుతున్నప్పటికి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నెల వేతనాన్ని 15 వేల నుండి 28719 రూపాయల వరకు సీఎం కేసీఆర్ పెంచారని తెలిపారు.

రాష్ట్రంలోనున్న అన్ని 12769 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని అయన అన్నారు. ప్రతిరోజు ఉదయం పూట తప్పకుండ ట్రాక్టర్, ట్రాలీల ద్వారా ఇండ్ల నుండి, వీధుల నుండి, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల నుండి, తడి, పొడి చెత్తను సేకరించి గ్రామంలోని డంపింగ్ యార్డుకు తరలించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్, సంఘం బాధ్యులు శశిధర్ గౌడ్,నరేష్, మల్లికార్జున్,రమేష్,తదితరులు ఉన్నారు.

- Advertisement -