పనసతో లాభాలెన్నో..!

53
- Advertisement -

పనస పండును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు చాలమంది. కాస్త ఒగరు తీపి పులుపు కలగలిపి ఉండే పనస రుచిలో కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే చాలమంది పనసను ఎంతో ఇష్టమైన పండుగా భావిస్తూ ఉంటారు. అయితే పనస తొనలు తిని అందులోని గింజలు బయట పారేస్తుంటారు. అయితే పనస గింజలలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. పనస గింజలలో విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే రైబోఫ్లెమిన్, థియామిన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కళ్లకు ఎంతో మేలు చేయడంతో పాటు చర్మం కాంతివంతంగా మారడానికి, వెంట్రుకలు దృఢంగా తయారు కావడానికి దోహద పడతాయి. పనస విత్తనాలలో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. .

అందువల్ల కండరాల పుష్టి పెరుగుతుంది. ఇక ఇందులో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత ఉన్న వాళ్ళు పనస విత్తనాలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఐరన్ కారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. ఇక పనస విత్తనాలలో ఉండే ఫైబర్ వివిధ రకాల ఉదర సమస్యలను కూడా దూరం చేస్తుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో మలబద్దకం కూడా పనస విత్తనలు తింటే దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పనస విత్తనాలలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. ఇక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను కూడా దూరం చేస్తాయట. అందుకే పనస విత్తనాలను ఏమాత్రం పక్కన పెత్తకుండా.. వీటిని కూడా తింటే అన్నీ రకాల పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం:గోనె ప్రకాశ్‌ రావు

- Advertisement -