కాంగ్రెస్ పార్టీ టికెట్లను వేలంపాటలో అమ్ముకుందని ఆరోపించారు పాల్వాయి స్రవంతి. హైదరాబాదక్ సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె..ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారుజ రేపటి నుండి మునుగోడు లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తేల్చిచెప్పారు. కనీసం మహిళ అనే గౌరవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు కేవలం డబ్బు డబ్బు అనే నినాదం తో నడుస్తుందన్నారు. ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని… పార్టీ ఫిరాయింపు దారులతో నిండిపోయిందన్నారు. ఈరోజు ఏం మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయమని అడుగుతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ ది అని అనడం తో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు.ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ నా వంతుగా కృషి చేస్తూ పని చేశాను. కానీ నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీ ని విడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు స్రవంతి.
Also Read:టాలీవుడ్ చంద్రమోహన్ ను అవమానించిందా?