కొల్లాపూర్‌లో పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభం..

65
Palle nidra

సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం స్ఫూర్తితో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం,తాండాలో పల్లె నిద్ర చేసి ప్రజా సమస్యల తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు టీఆర్‌ఎస్‌ నేత రంగినేని అభిలాష్ రావు. అందులో భాగంగా నిన్న రాత్రి చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

మొదట గ్రామస్తులు అభిలాష్ రావుకు ఘనస్వాగతం పలికారు. గ్రామ సమస్యలు చాలా సావధానంగా వినడం జరిగింది. ఈ సమావేశ అనంతరం అందరితో సహపంక్తి భోజనం చేసి అక్కడే నిద్ర చేయడం చేశారు. ఈ రోజు ఉదయం గ్రామ పెద్దల కోరిక మేరకు స్థానికులు నిరంతరం ఎదురుకుంటున్న సమస్యలు ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ కార్యక్రమంలో మండలం సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఈ ప్రాంతంలో ఇంత చిన్న వయసులోనే ప్రజల మధ్యకు వచ్చి మాలో మమేకం అయినందుకు అభిలాష్ రావును అభినందించారు. పల్లె నిద్ర కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు రంగినేని అభిలాష్ రావు.