బీసీ బిడ్డపై ఇంత దుర్మార్గమా..?

42
- Advertisement -

బీసీ బిడ్డ, బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ ముదిరాజ్‌పై అరెస్టు అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. ప్రశాంత్‌ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో అవరోధాలను, కష్టనష్టాలకు ఓర్చి ఓ బీసీ బిడ్డ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనలో ప్రశాంత్‌ ప్రమేయం లేకపోయినా కేసులు పెట్టి అరెస్టు చేయడంతోపాటు, బెయిల్‌ ఇవ్వకుండా పోలీసులు వేధిస్తుండడమే అందుకు నిదర్శమని ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పల్లవి ప్రశాంత్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కేసును ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు.

Also Read:సలార్ పై లేటెస్ట్ విశేషాలు

- Advertisement -