గ్రీన్‌ ఛాలెంజ్‌@ పల్లవి ఇంటర్‌నేషనల్‌ స్కూల్

336
- Advertisement -

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో పల్లవి ఇంటర్ నేషనల్ స్కూల్‌ ఈ యేడాది జూన్‌ 15వ తేదీ నుంచి నూతనంగా బ్రాంచిని ప్రారంభించింది. విశాలమైన తరగతి గదుల్లో అత్యంత అధునిక హంగులతో కూడిన ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్‌ తగ్గట్టుగా నూతన బ్రాంచిని పాఠశాల డైరెక్టర్ సుశీల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ రోజు నుంచి 3వ తరగతి నుండి 6వ తరగతి విద్యార్థులు పాఠశాలకు విచ్చేశారు. విద్యార్థులు తొలిరోజు నూతనోత్సాహంతో ఉపాధ్యాయులతో మింగిల్‌ అయ్యారు. పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, ఇతర సిబ్బంది ఘన స్వాగతం పలికింది.

పాఠశాల డైరెక్టర్ గౌరవనీయులైన సుశీల్‌ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులలో సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించటమే పల్లవి ఇంటర్‌ నేషనల్ స్కూల్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులకు ఉపాధ్యాయ బృందాన్నికి అల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Also Read: లివర్‌ చెడిపోవడానికి కారణం..?

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మాట్లాడుతూ… పల్లవి ఇంటర్‌ నేషనల్ స్కూల్‌ విద్యార్ధుల జీవితంలో అత్యంత అద్భుతమైన విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తుందని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులందరి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు మొక్కలను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ పుట్టిన రోజున ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులకు దిశానిర్ధేశం తెలియజేశారు.

Also Read: కంటి చూపు కాపాడుకోండిలా !

- Advertisement -