పెంచిన చరిత్ర మీది.. పెంచని చరిత్ర మాది..

127
Palla Rajeshwar Reddy
- Advertisement -

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవ్వాళ కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో స్థానిక శాసన సభ్యులు వనమా వెంకటేశ్వర రావు, మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గార్లతో కలిసి ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సంవత్సర కాలంలో కొత్తగూడెం కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చుకుంటాం అని అన్నారు. కాలువలు తొవ్వుతున్నం, ప్రాజెక్టులు శరవేగంగా కడుతున్నాం… మన నీళ్లు మనకు కేసీఆర్ తెచ్చిపెడ్తున్నరు అని అన్నారు. మన పైసలు మనకి ఒస్తున్నయి కాబట్టే 43 లక్షల మందికి 1000 రూపాయల నుండి 2000 రూపాయలకు పింఛన్ పెంచుకున్నాం, మన నిధులు మనం ఉపయోగించుకుంటున్నాం. ఆర్థిక వృద్ధి రేటులో నెంబర్ వన్ గా ఉన్నం… 100 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకునే మనం బికారి రాష్ట్రమా… 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకునే జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ బికారి రాష్ట్రాలా మీరే నిర్ణయించండి అని అన్నారు.

కేసీఆర్ లక్ష ఉద్యోగలు ఇస్తా అన్నావ్ కదా ఎప్పుడిస్తావ్ అని అడుగతున్నారు.. ఉద్యోగాల గురించి తెలియనోళ్లు, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటయో తెలియనోళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నరు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం, పోలీస్ డిపార్ట్మెంట్లో 32 వేల ఉద్యోగాలు ఇచ్చినం..13,500 ఉద్యోగాలను సింగరేణిలో ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్.. అదే సింగరేణిని ప్రైవటైజ్ చేద్దామని బీజేపీ చూస్తుంది అని పల్లా తెలిపారు. బీహెచ్ఈఎల్ కు గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జీ టు జీ) ఆర్డర్స్ ఇచ్చి రక్షించింది కేసీఆర్ అని అన్నారు. సింగరేణిలో ఎక్స్ప్యాంషన్ చేస్తూ అవసరమైన వారికి ఉద్యోగాలిస్తూ, వనరుల కల్పన చేస్తూ, సింగరేణిని ప్రైవేట్ కానియ్యకుండా చూస్తుంది కేసీఆర్. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడ్తున్నరు, మేమైతే సింగరేణిని మంచిగ చేస్తాం అని, ఏం చేస్తారో చెప్పండి. మేమైతే సింగరేణిని మూసేయ్యలే, ఉద్యోగాలు తొలగించలే, బోనస్లు తగ్గించలే, వసతులు తగ్గించలే… నువ్వు ఏం చేస్తవో మాకంటే ఎక్కువ చెప్పు రాజేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు.

దేశంలో ఉన్న 30 పెద్ద కంపెనీలను మూసేసిన చరిత్ర బీజేపీది. అన్ని ప్రైవటైజ్ చేసుకుంటూ, మూసేసుకుంటూ, అమ్ముకుంటూ, సింగరేణిని ప్రైవటైజ్ చేయను అని చెప్తున్నవ్, ఎట్ల నమ్మాలి అని అన్నారు. మేమైతే చార్జీలు పెంచలే.. నువ్వేం చేసినవ్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినవ్… పెంచిన చరిత్ర నీది, పెంచని చరిత్ర మాది, ఎట్ల నమ్మాలి నిన్ను అని అడిగారు. ఐటీఐఆర్ నువ్వు ఇచ్చినట్లైతే 15 లక్షల ఉద్యోగాలు తెలంగాణల ఒచ్చేవి, దాన్ని తీసేసుకున్నవ్ అని అన్నారు. మేం మా కష్టంతో, శ్రమతో, తెలివితో పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చినం..16 నెలలు తిరిగేది పెర్మిషన్స్ కోసం, 15 రోజుల్లో ఇస్తున్నం. ఇక కాంగ్రెస్ చచ్చిన పాములా అయిపోయింది, దాని గురించి మాట్లాడి కూడా అనవసరం. ప్రశ్నించడం మీకు కొత్తేమో, తెలంగాణ బిడ్డలకి కొత్తేమి కాదు.. నువ్వు ప్రశ్నని ప్రశ్నలాగా ఉంచుతవ్, మేము ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి పరిష్కార కేంద్రం దగ్గరికి తీసుకపోతం… పరిష్కారం చేసి చూపిస్తం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

- Advertisement -