బండి సంజయ్ పేరు మోసిన గుండాలతో నల్లగొండ రైతులపై దాడి చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన పల్లా…యాసంగిలో పంట వేయాలో తెలియక.. వానాకాలం పండిన పంట మొత్తం కొంటారో తెలియని ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లుగా రైతులు పండించిన ప్రతీ గింజ కొన్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వానా కాలంలో పండిన పంట సేకరణ కోసం 4500 సెంటర్లు ఏర్పాటు చేసి….9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. సజావుగా జరుగుతున్న ఐకేపీ సెంటర్ వద్ద రైతులను రెచ్చగొట్టి.. రైతులు ఏకీభవించకుంటే రాళ్లతో దాడి చేసి గాయపరిచారన్నారు. రైతుల కల్లాలు చూసే పేరిట రైతుల రక్తం చూసారు…యూపీలో కార్లతో తొక్కించి రైతులను చంపారు.. నల్లగొండలో రాళ్లు, కర్రలతో దాడి చేసి రైతులను గాయపరిచారని మండిపడ్డారు.
బండి సంజయ్ ఏ పాలసీతో ఆ పర్యటన చేశారు…సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరిధాన్యం దేశంలోనే ఎక్కువ పండించడమే కాకుండా.. కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి అప్పగించాం అన్నారు. వరిధాన్యం కొంటారో కొంటారో చెప్పకుండా ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. యాసంగిలో వరి పంట వేయొద్దని కేంద్రం చెబితే.. బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా బూటకపు మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ పార్టీకి పాలసీ ఉంటే ఉత్తర భారతదేశంలో కొన్నట్టు పంటలను దక్షిణ భారతదేశంలో.. తెలంగాణలో ఎందుకు కొనడం లేదన్నారు.