కల్వకుంట్ల కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు!

5
- Advertisement -

కాంగ్రెస్ పార్టీయే కల్వకుంట్ల ఫామిలీలో చిచ్చు పెట్టింది అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పల్లా… బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆందోళనల దృష్ట్యా కవితను సస్పెండ్ చేశారు అన్నారు.

కాంగ్రెస్ ట్రాప్ లో పడి సీనియర్ నేతలపై ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు… పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కన్న కూతురైనా, దగ్గరి బంధువైనా, ఇంకెవరైనా సమానమే అని కేసీఆర్ సందేశం ఇచ్చారు అన్నారు. చాలా బాధతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నారు.

పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయం అన్నారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సిండే. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాము అన్నారు.

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

- Advertisement -