నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 7 రౌండ్లకు గాను అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను కనబర్చారు. పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 రాగా తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్‌కు 27,588 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
సెకండ్ ప్రయారిటీ ఓట్లు కీలకంగా కావడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలవగా ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి.