శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగట్టారు ఎమ్మెల్యే పల్లా. దీంతో మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని… ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్నాం అన్నారు. రైతులకు ఏమి చేయలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పడం అవాస్తవమని కోమటిరెడ్డి తెలిపారు.
దీనిపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రైతులకు సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని… తాను చెప్పిన అంశాలు తప్పులని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు అని మండిపడ్డారు.
Also Read:ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన: కేటీఆర్