31 మంది మంత్రులతో ‘పళని’ ప్రమాణం

216
Palanisamy to take oath as CM
- Advertisement -

తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. కొత్తముఖ్యమంత్రి చేత గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణస్వీకారం చేయించారు. పళనిస్వామి సారథ్యంలో 31 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గంలోకి కొత్తగా ఆ పార్టీ నేత సెంగొట్టియన్‌కు అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు అవకాశం కల్పించారు పళనిస్వామి. అయితే శశికళ బంధువులేవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. కీలక పదవులైన 19 శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు.

శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు చివరివరకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తగినంత సమయం లభించినప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో పన్నీర్ విఫలమయ్యారు. చివరకు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో బలం నిరూపించుకునేందుకు గడువు ఇచ్చారు.

మంత్రుల వివరాలు..
* పళనిస్వామి – ముఖ్యమంత్రి, హోంశాఖ, నీటిపారుదల, రహదారులు.
* సెంగొట్టియన్‌: ఆర్థిక, పాఠశాల విద్య
* దిండిగల్‌ శ్రీనివాసన్‌ – అటవీశాఖ
* ఒ.ఎస్‌. మణహయన్‌ – చేనేత
* సెల్లూర్‌ రాజు – సహకార
* సి. విజయభాస్కర్‌ – ఆరోగ్యం
* డి. జయకుమార్‌ -మత్స్యశాఖ
* ఎం.సి సంపత్‌- పరిశ్రమలు
* కరుపన్నన్‌ – పర్యాటకం
* తంగమణి – విద్యుత్‌శాఖ
* వేలుమణి – పురపాలక శాఖ
* షణ్ముఘం – న్యాయశాఖ
* కె.పి.అంబజ్‌గాన్‌ – ఉన్నతవిద్య
* కామరాజ్‌ – పౌరసరఫరాల శాఖ
* వి. సరోజ – సాంఘిక సంక్షేమం
* కె. రాధాకృష్ణన్‌ – గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
* దురైకన్ను – వ్యవసాయం
* కాదంబర్‌ రాజు – సమాచార, ప్రసారాలశాఖ
* ఆర్‌.బి. ఉదయకుమార్‌ – రెవెన్యూశాఖ
* నటరాజన్‌ – పర్యాటకం
* కె.సి. వీరమణి – వాణిజ్యపన్నులు
* కె.టి. రాజేంద్ర బాలాజీ – డెయిరీ అభివృద్ధి
* పి.బెంజమిన్‌ – గ్రామీణ పరిశ్రమలు
* డాక్టర్‌ నిలోఫర్‌ కఫీల్‌ – కార్మికశాఖ
* ఎం.ఆర్‌.విజయభాస్కర్‌ – రవాణాశాఖ
* డాక్టర్‌ ఎం.మణికందన్‌ – ఐటీశాఖ
* వి.ఎం.రాజలక్ష్మీ – గిరిజన సంక్షేమం
* జి. భాస్కరన్‌ – ఖాదీ బోర్డు
* సెవ్వూర్‌ ఎస్‌.రామచంద్రన్‌ – దేవాదాయశాఖ
* ఎస్‌.వలర్‌మతి – బీసీ సంక్షేమం
* పి.బాలకృష్ణారెడ్డి – పశు సంవర్థకశాఖ

- Advertisement -