సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

27

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులందరికీ రైతు బంధు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఆర్‌ఎస్‌ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు (పంట సాయం)చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఉప్పు రాజ్ కుమార్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోన సమయంలో రైతులు ఇబ్బందులు పడొద్దని వారిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉండాలని, వారు పంట సాయం కొరకు ఎవరి వద్దకు వెళ్లొద్దని ప్రతి సవత్సరంలాగే ఈ సారి రైతుబంధు నగదు బ్యాంకులలో జమ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ వెంటే ఉండాలని మమ్మాళిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు,టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.