ఓటీటీలో పక్కా కమర్షియల్!

81
gopichand
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ హీరో గోపిచంద్. అయితే ఇటీవ‌లి కాలంలో ఆయ‌న న‌టించిన సినిమాలు పెద్దగా స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌పై భారీ ఆశ‌లు పెట్టుకోగా జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకువచ్చింది. ఈ సినిమాతో సక్సెస్‌తో అందుకున్నారు గోపిచంద్.

ఇక తాజాగా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ ఫ్లిక్స్ ,ఆహాలో ఇవాళ్టి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో విడుద‌లైన నాలుగు వారాల త‌ర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది.

రాశీఖన్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.

- Advertisement -