‘పక్కా కమర్షియల్’ సెన్సార్ పూర్తి..

102
- Advertisement -

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ మారుతీ దర్శకత్వంలో చేసిన మూవీ ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమాను జూన్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ బిజీగా ఉన్నారు. తాజాగా సినిమాకు సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ యూనిట్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్‌ను ఇచ్చారు.

ఇక సినిమా నిడివి విషయానికి వస్తే 2 గంటల 32 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. పర్ఫెక్ట్ రన్ టైమ్ ఫిక్స్ చేసిన దర్శకుడు మారుతి అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా తెరపైకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్–యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన రాశీఖ‌న్నా హీరోయిన్‌గా కనిపించనుంది.

- Advertisement -