ఖచ్చితంగా బదులిస్తాం: పాక్

16
- Advertisement -

భారత్ మెరుపు దాడులపై స్పందించారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ తెలిపారు. భారత్ సైన్యం పాకిస్థాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది అన్నారు.

భారత్ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది… శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్ ఆర్మీకి తెలుసు అన్నారు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం…. భారత్ దాడులను యుద్ధ చర్యలుగా అభివర్ణించారు.

ఆపరేషన్ సిగార్పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడులను పలుదేశాలకు వివరించింది భారత్‌. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్రస్థావరాలపై దాడులను వివరించింది భారత్‌.

Also Read:భార‌త సైన్యానికి సెల్యూట్ :కేటీఆర్

- Advertisement -