భారత్‌పై పాక్ గెలుపు

172
ind vs pak
- Advertisement -

తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది పాకిస్థాన్. ఆదివారం జరిగిన మ్యచ్‌లో భారత్‌పై పాక్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 182 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. మహమ్మద్‌ నవాజ్‌ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో పాక్ గెలుపొందింది.

ఇక అంతకముందు టాస్ గెలిచిన పాక్…భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఆరంభం నుండే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు భారత బ్యాట్స్‌మెన్‌. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (28; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. నవాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కగా భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ మంగళవారం శ్రీలంకతో తలపడనుంది.

- Advertisement -