పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటెంట్ల దాడులు, వాటికి ప్రతిగా పాకిస్థాన్ సైన్యం చేపడుతున్న కఠిన ఆపరేషన్లతో అక్కడ మారణహోమం కొనసాగుతోంది. తాజాగా బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై విస్తృత స్థాయిలో సైనిక ఆపరేషన్లు నిర్వహించినట్లు పాకిస్థాన్ మిలిటరీ వెల్లడించింది.
ఈ ఆపరేషన్లలో మొత్తం 92 మంది బలూచిస్తానీ మిలిటెంట్లను హతమార్చినట్లు సైన్యం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఈ దాడులు, ఎదురు దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సమయంలో 15 మంది సెక్యూరిటీ సిబ్బంది, అలాగే 18 మంది అమాయక సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు మిలిటరీ తెలిపింది. ఈ ఘటనలు బలూచిస్తాన్‌లో పరిస్థితులు ఎంత తీవ్రమయ్యాయో స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, బలూచిస్తాన్‌లో జరుగుతున్న పలువురు దాడులకు తామే బాధ్యులమని గతంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తూ, స్వాతంత్ర్య డిమాండ్‌తో దాడులకు పాల్పడుతోంది.
నిత్యం జరుగుతున్న హింసతో బలూచిస్తాన్‌లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

