వైరల్‌ వీడియో.. పులికి లిప్ కిస్!

15
- Advertisement -

ఓ పాకిస్థాన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పులిని ముద్దాడుతూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే హస్సన్ చేసిన ఈ స్టంట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్‌లో చిరుతలు, పులులు వంటి అసాధారణ జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుండటం రోజురోజుకి పెరిగిపోతోంది.

పాకిస్తాన్ వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఇటువంటి జంతువులను వ్యక్తిగతంగా పెంచడాన్ని నిషేధించినప్పటికీ, అమలులో కార్యరూపం దాల్చకపోవడంతో చాలామంది జంతువులను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో లాహోర్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హస్సన్ ఏకంగా పులిని ముద్దాడుతూ వీడియోను రిలీజ్ చేశారు.

కొంతమంది హుస్సన్ సాహసాన్ని కొనియాడుతున్న మరికొంతమంది మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. ఇది చాలా ప్రమాదకరం.. ఈ వీడియో చూస్తే భయంగా ఉందని కామెంట్ చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Nouman Hassan (@nouman.hassan1)

 

Also Read:కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్

- Advertisement -