పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..

5
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు . పాకిస్తాన్ తాలిబాన్‌కు అనుబంధమైన బన్ను, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది.

పేలుళ్ల అనంతరం ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సమీపంలోని ఇళ్లకు, భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ పేలుళ్ల ప్రభావంతో సమీపంలోని మసీదు పైకప్పు కూలిపోయింది. అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్న పలువురు లోపల చిక్కుకుపోయారని రక్షణ సిబ్బంది తెలిపారు. మసీదు ఇమామ్ మృతదేహాన్ని శిథిలాల మధ్య నుండి వెలికితీసినట్లు తెలిపారు.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.గత నవంబరులో జరిగిన ఒక ఆత్మాహుతి కార్ బాంబింగ్ దాడిలో 12 మంది సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తర్వాత గోడను బద్దలు కొట్టి చాలా మంది ఉగ్రవాదులు కంటోన్మెంట్‌ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, భద్రత దళాలు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు.

Also Read:కాంగ్రెస్‌..కరెంట్,నీళ్లు, రైతు బంధు రాదు!

- Advertisement -