క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన భారత్-పాక్ మ్యాచ్ వార్ వన్‌సైడ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ అదే జోరును కంటిన్యూ చేస్తూ పాక్‌ను చిత్తు చేసింది. భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభతో పాక్ ఖంగుత్తింది. ఇక సోషల్ మీడియా వేదికగా భారత్ గెలుపును ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ పాక్ ఆటగాళ్లను ఆటాడుకుంటున్నారు.
పాక్ బౌలర్లలో హసన్ అలీ 9 ఓవర్లు వేసి 84 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. మిగిలిన ఒక్క ఓవర్ వేస్తే సెంచరీ కొట్టేవాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పాపం పాక్ బౌలర్ 16 రన్స్ తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కొల్పోయాడని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు భారత్ గెలుపులో కీలకంగా మారిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్‌ను జవాన్ అభినవ్‌తో పోలుస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారని కొనియాడుతున్నారు. ఇక టిక్ టాక్‌లో పాక్ ఆటగాళ్లను ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.
మొత్తంగా వరుణుడి ఎంట్రీ మ్యాచ్‌ను ఆలస్యం చేసిందే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. దీంతో మరోసారి ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఫైనల్ కాని ఫైనల్‌గా భావించిన దాయాది సమరంలో భారత్ నూటికి నూరుశాతం అదిరిపోయే ప్రదర్శనతో ప్రపంచకప్ టైటిల్ రేసులో మరో విజయాన్ని రుచి చూసింది.