కాల్పులు ఆపండంటూ ఇండియన్ ఆర్మీని వేడుకున్న పాక్ రేంజర్లు…

190
- Advertisement -

పాకిస్థాన్‎కు ఎన్నిసార్లు చెప్పినా.. తన తీరు మాత్రం మార్చుకోదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. ఇప్పటికే పలువురు సైనికులను, పౌరులను పొట్టన పెట్టుకున్న పాక్‎కు ఎలాగైనా బుద్ది చెప్పాలనుకున్నారు బీఎస్‎ఎఫ్‌ జవాన్లు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్థాన్ బంకర్లపై ఏకదా‎టిగా దాడి చేసి ధ్వంసం చేశారు. మే 19న పాక్ బంకర్లను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Pak troops 'plead for ceasefire' after BSF destroys assets across IB

భారత బలగాలు జరిపిన కాల్పులు తట్టుకోలేక.. కాల్పులు ఆపాలంటూ జమ్మూ బీఎస్ఎఫ్ అధికారులకు పాక్ రేంజర్లు ఫోన్ చేసి మరి వేడుకుంది. గత మూడు రోజులగా భారత బలగాలు జరిపిన కాల్పులతో పాకిస్థాన్ రేంజర్లు హడలిపోయారు. మరోవైపు పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పులకు సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఇళ్లు దెబ్బతిన్నాయి. అక్కడి ప్రజలు గ్రామాలను వదిలి వెల్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్పరంలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 38 మంది భారతీయులు మృతి చెందారు. అందులో 18 మంది జవాన్లు ఉన్నారు.

- Advertisement -