పాక్‌ వైమానిక దాడి..అఫ్గాన్‌ క్రికెటర్లు మృతి

28
- Advertisement -

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. పాకిస్తాన్ – అఫ్గానిస్థాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్ ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది పాక్.

ఈ దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు, మరో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారు దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్, సిబాతుల్లాలుగా గుర్తించారు అధికారులు.

వచ్చే నెలలో పాక్, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్ సిరీస్‌లో అఫ్గాన్ తరపున జట్టులో ఉన్నారు ఈ ముగ్గురు క్రీడాకారులు. ఈ దాడి నేపథ్యంలో ట్రై సిరీస్ నుండి తప్పుకుంది అఫ్గానిస్థాన్.

Also Read:పోలింగ్ డే…సెలవు

- Advertisement -