ఖమ్మంలో పైసా వసూల్‌ ఆడియో

173
PaisaVasool Audio on aug 17th
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు పూరి టీం బాలయ్య అభిమానులకు మరో శుభవార్త చెప్పింది. పైసా వసూల్ ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

PaisaVasool Audio on aug 17th
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకి ‘ఖమ్మం’ వేదిక కానుంది. ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను జరపనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.

శ్రేయ, ముస్కాన్, కైరాదత్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, పృథ్వీ, విక్రమ్జిత్ సహా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

PaisaVasool Audio on aug 17th

- Advertisement -