పక్కా.. పైసావసూల్ !

172
Balakrishana paisa vasool
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌,ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయిపోయారు.

ఇక ఈ మూవీ ఉండబోతుదంటే.. ‘పోకిరి’ తరహాలో బాలయ్య సరికొత్త జోష్‌లో ఉంటాడని.. స్టైల్, ఫైట్స్, సాంగ్స్‌కు థియేటర్స్‌లో ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుందని టాక్. ఫస్ట్ హాఫ్ జెట్ స్పీడ్‌లో ఉంటే, ఇంటర్వెల్ బాంగ్ కూడా అదిరిందని న్యూస్. సెకండ్ హాఫ్‌లో స్టోరీ కోసం కాస్త స్పీడ్ తగ్గినా.. ట్విస్ట్స్, యాక్షన్ పార్ట్, ఆలీ కామెడీ, బాలయ్య పాడిన పెగ్ సాంగ్, ఎన్టీఆర్ రీమిక్స్ సాంగ్ ఎంటర్‌టైన్ చేస్తాయని.. ఇది పక్కా ఆడియన్స్‌కు పైసావసూల్ అని సమాచారం. చాలా రోజుల నుండి సరైన హిట్‌ లేని పూరీకి ఈ మూవీ కూడా కీలకం కావడం ‘పైసావసూల్’పై అంచనాలు పెరుగుతున్నాయి.

- Advertisement -