‘పద్మావతి’ని పద్మావత్‌గా మార్చేశారు..!

226
'Padmavati' is Now 'Padmavat'
- Advertisement -

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. ‘పద్మావతి’ అనే పేరును ‘పద్మావత్’ గా మార్చాలని తెలిపింది. మొత్తం సినిమాలో 26 సన్నివేశాలను కట్ చేస్తామని చెప్పింది. ఇక పద్మావత్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. రాజ్‌పుత్ సంఘాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడంతో పద్మావతి ఫిల్మ్ విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే.

'Padmavati' is Now 'Padmavat'

అయితే పద్మావతి సినిమాకు సెన్సార్ ఇవ్వాలా వద్దా అన్న అంశంపై బోర్డు ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ ఈనెల 28వ తేదీని భేటీ అయ్యింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సెన్సార్ బోర్డు సినిమా పేరును మార్చాలని సూచించింది. పద్మావత్‌కు యూఏ సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వనున్నారు. సినిమాలో స్వల్ప మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. మార్పులు జరిగిన తర్వాతే సినిమా రిలీజ్‌కు సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

సినీ నిర్మాతలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను సమీక్షించినట్లు సెన్సార్ బోర్డు పేర్కొన్నది. సెన్సార్ ప్యానెల్లో ఉదయ్‌పూర్‌కు చెందిన అరవింద్ సింగ్, డాక్టర్ చంద్రమణి సింగ్, ప్రొఫెసర్ కేకే సింగ్(జైపూర్ వర్సిటీ)లు ఉన్నారు. అయితే చరిత్రాత్మక సంఘటనల ఆధారంగా సినిమా తీయడం వల్ల.. ఆ సంఘటనల్లో కొన్ని మార్పులను ప్యానెల్ సూచించినట్లు సమాచారం.

- Advertisement -