బాక్సాఫీస్ దంగల్… పద్మావత్‌

235
Padmaavat box-office collections
- Advertisement -

దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రలలో, సెన్సేషనల్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘పద్మావత్’. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు జనవరి 25వ తేదీన భారీస్థాయిలో విడుదలైందీ చిత్రం. విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్లను సాధిస్తూ టాక్ ఆఫ్ ది సినిమాగా నిలుస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశసంలు గుప్పిస్తున్నారు.

తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా పద్మావ‌త్ మూవీ గ‌త చిత్రాలు పీకే, ధూమ్ 3, దంగ‌ల్‌, భ‌జ‌రంగీ బాయిజాన్ చిత్రాల పేరిట ఉన్న రికార్డుల‌ని చెరిపేసింది. యూఎస్‌, కెన‌డాల‌లో క‌లిపి ప‌ద్మావ‌త్ చిత్రం $1,841,628 వ‌సూళ్ళు సాధించింది.పెయిడ్ ప్రివ్యూల ప్రదర్శనతోనే ఆ సినిమా రూ.5 కోట్లు రాబ‌ట్టింది.

అయితే కర్ణిసేన ‘పద్మావత్‌’ బాక్సాఫీస్‌ వసూళ్లపై కర్ణిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ సన్నిలియోన్‌(మాజీ పోర్న్‌ స్టార్‌)కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎన్నో వివాదాల మధ్య విడుదలైన పద్మావత్‌..రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.

- Advertisement -