ఇళయరాజాకు పద్మవిభూషణ్‌..ధోనికి పద్మభూషణ్‌

238
Padma Awards For Ilaiyaraaja, MS Dhoni
- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 3కి పద్మ విభూషణ్,9 మందికి పద్మ భూషణ్,73 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 85 మందిని పద్మ పురస్కారంతో సత్కరించింది.

ఏపీ నుంచి కిడాంబి శ్రీకాంత్‌కి పద్మ అవార్డు లభించింది. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటు మహారాష్ట్రకు చెందిన గులాం ముస్తఫా ఖాన్ (కళలు-సంగీతం), కేరళకు చెందిన పరమేశ్వరన్ (సాహిత్యం-విద్య)లకు పద్మవిభూషణ్ ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోని, పంకజ్ అద్వానీ, అలెగ్జాండర్ కదాకిన్, ఫిలిపోస్ మర్ క్రిసోస్తం, రామచంద్రన్ నాగస్వామి, వేదప్రకాశ్ నంద, లక్ష్మణ్ పాయి, అరవింద్ పారిక్, శారద సిన్హా లకు పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించారు.

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా, విజయలక్ష్మీ నవనీత కృష్ణన్(కళారంగం), మురళీకాంత్ షెట్కర్(క్రీడారంగం), కేరళకు చెందిన లక్ష్మీకుట్టి (వైద్యరంగం), ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం), మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం), బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం), సుభాషిణి మిస్త్రీ(సామాజిక సేవ), కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మ(వైద్యరంగం), హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్(వైద్యరంగం), తమిళనాడుకు చెందిన రాజగోపాలన్ వాసుదేవన్(సైన్స్, ఇంజినీరింగ్), అన్వర్ జలాల్ పూర్(ఉర్దూ సాహిత్యం-విద్య), ఇబ్రహిం సుతార్ (సంగీతం-సూఫీ), మానస్ బిహారి వర్మ(సైన్స్ అండ్ ఇంజనీరింగ్-డిఫెన్స్), సీతవ్వ జొడ్డాటి (సామాజిక సేవ), నౌవ్ మార్వా (యోగా), నానమ్మాళ్(యోగా), పంకజ్ జోషి(నటుడు) ఉన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకూ అవార్డుల్లో పెద్దపీట వేసిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికి మాత్రమే అవార్డు అందగా, తెలంగాణకు అది కూడా లేదు. బీజేపీ పాలిత మహారాష్ట్రకు అత్యధికంగా 11 అవార్డులు దక్కగా, మధ్యప్రదేశ్ కు 4, గుజరాత్ కు 3 ‘పద్మ’ అవార్డులు లభించాయి. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఏకంగా 9 అవార్డులు లభించాయి. ఇంకా తాము పాగా వేయాలని భావిస్తున్న తమిళనాడుకు 5, పశ్చిమ బెంగాల్ కు 5, కేరళకు 4, ఒడిశాకు 4 అవార్డులను ఇచ్చిన కేంద్రం మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూసిందన్న విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -