ప్రేమిస్తూ బతికేస్తున్నా…సాయిపల్లవితో శర్వా..!

280
sharwanand sai pallavi
- Advertisement -

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘పడి పడి లేచే మనసు’ . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ హనురాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం,చెరుకూరి సుధాకర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ని విడుదల చేసింది.

సింప్లీ,సూపర్‌గా ఉండేటట్లు టీజర్‌ని తెరకెక్కించారు. సాయి పల్లవి ఎక్కడికి వెళితే అక్కడికి శర్వా ఫాలో అవుతుండటం… శర్వా దగ్గరకు వెళ్లి.. ‘ఓయ్.. లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా?’ అని అడగటంతో టీజర్ మొదలవుతుంది. తర్వాత ‘మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏమీ బాగోలేదండి. ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే’’ అని చెప్పే డైలాగ్‌ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -