భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు 1:100 పిలవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట.. అధికారంలో ఉన్నపుడు ఒక మాట అనేది కాంగ్రెస్ వాళ్లకు అలవాటుగా మారిపోయిందన్నారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడుతున్నారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ సీనియర్ నాయకుడిగా ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడి మీ గౌరవాన్ని కోల్పోవడం మంచిది కాదని సూచించారు.గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క కూడా గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని డిమాండ్ చేశారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా.. లేనప్పుడు అలా మాట్లాడటం సరికాదు అన్నారు. కాంగ్రెస్ కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారు… హామీలు నెరవేర్చకపోతే.. ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాత పెడుతారు అని హెచ్చరించారు.
ప్రతి హామీనీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం. ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం. భయపడే ప్రసక్తే లేదు అన్నారు హరీష్. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏడు నెలలు అయినా హామీల నెరవేరలేదు… ఈ ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ.. ఆరు స్కామ్స్ చేశారు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారు అన్నారు.
Also Read:Pawan:తొలి సంతకం ఆ ఫైలు పైనే!