హరీశ్‌ రావుపై అక్రమ కేసులు అప్రజాస్వామికం

6
- Advertisement -

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావు పై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగట్టిన హరీష్ రావును భయపెట్టే ప్రయత్నం చేయడం కక్షపూరిత చర్య అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

అణచివేత మీ విధానం అయితే, ఎదిరించడం మా నైజం అన్నారు. నిర్బంధాలు,ఆంక్షలు, కంచెలు మీ పరిపాలనలో నిత్య కృత్యమయ్యాయి. నీ తాటాకు చప్పులకు బిఆర్ఎస్ భయపడదు…ఖబర్దార్ రేవంత్ రెడ్డి నిన్ను అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం. ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటాం అన్నారు.

Also Read:ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -