అవినీతి చేయలేదు..తడి బట్టలతో కౌశిక్ ప్రమాణం

8
- Advertisement -

తాను ఎక్కడ అవినీతి చేయలేదని తడి బట్టలతో ప్రమాణస్వీకారం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తన నిజాయతీని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కౌశిక్‌ రెడ్డి సవాలు విసిరారు.

తాను ఎలాంటి అవినీతి చేయలేదని తడి బట్టలతో దేవుడి ఫొటో ముందు పాడి కౌశిక్‌ రెడ్డి ప్రమాణం చేశారు. పొన్నం సైతం ఫ్లైయాష్‌ తరలింపు, ఓవర్‌లోడ్‌ లారీల నుంచి డబ్బులు తీసుకోలేదని దేవుడి మీద ప్రమాణం చేయాలన్నారు. ఒకవేళ పొన్నం రాకపోతే అన్ని స్కామ్‌లు చేసినట్లు, అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నానని ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు.

కౌశిక్‌ రెడ్డి ఎలాంటి అవినీతి చేయకపోతే చెల్పూరు హనుమాన్‌ టెంపుల్‌కు వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్‌ నేతలు సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన కౌశిక్‌ రెడ్డి ఇవాళ చిల్పూరు వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వీణవంకలోని తన ఇంట్లోనే కౌశిక్‌ రెడ్డి ప్రమాణం చేసి తన నిజాయతీని రుజువు చేసుకున్నారు.

Also Read:Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

- Advertisement -