కౌశిక్ రెడ్డి..బ్లాక్ బుక్!

4
- Advertisement -

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని… తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానిన తెలిపారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించానని.. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.

అధికారులు తమ పని తాము చేసుకోవాలని చట్ట విరుద్దంగా ప్రవర్తించే వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం బ్లాక్ బుక్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు కౌశిక్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నా ఇంటికి వచ్చారు. ఆయనకు పీసీసీ పదవి ఇప్పించాలని నన్ను బతిమిలాడారు అన్నారు.

రేవంత్‌ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్ఠితి అని విమర్శించారు.చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంలను చాలామందిని చూశాం. రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు అని ఎద్దేవా చేశారు.

Also Read:“కలి”..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -