ముఖ్యమంత్రి వైయస్ జగన్ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి గుంటూరు జిల్లా నరసరావుపేటను పల్నాడు జిల్లాగా ప్రకటించిన నేపధ్యంలో సంఘీభావంగా వేలాదిమంది పల్నాటి ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.నరసరావుపేట శివుడి బొమ్మ సెంటర్ నుంచి కోటప్పకొండకు పాదయాత్రగా తరలివెళ్లారు.కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల (పల్నాడు జిల్లా ఏర్పాటు)సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ పల్నాటి ప్రజల హృదయాలలో నిలిచిపోతారని నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.
నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు,రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి,నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాదయాత్రలో అగ్రభాగాన నిలిచారు. గుంటూరు నగరంలో రాష్ర్టంలో నూతన జిల్లాల ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ధన్యవాదాలు తెలియచేస్తూ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. లాడ్జిసెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన శంకర్ విలాస్ సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్,పశ్చిమ శాసనసభ్యులు మద్దాళి గిరి,డిప్యూటి మేయర్ సజీల, పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు.