తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా..!

486
pacs
- Advertisement -

తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల

పీఏసీఎస్‌ పర్సన్ ఇంఛార్జీలో పదవీ కాలం ముగుస్తున్నందున నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించిన సీఎం….. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దీంతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.

ఇక ఇప్పటికే  తెలంగాణలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రితీలో గులాబీ పార్టీ జెండా ఎగురవేయగా పీఏసీఎస్ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ విజయం వన్ సైడే కానుంది.

- Advertisement -