టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పచ్చీస్’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు శ్రీకృష్ణ, రామసాయిలు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేతావర్మ హీరో యిన్. అవాస చిత్రం, రాస్తా ఫిల్మ్ బ్యానర్స్ పతాకాలపై కత్తూరి కౌశిక్ కుమార్, రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇవాళ అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో రామ్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ :
అభిరామ్ (రామ్) పైలా పచ్చీస్ గా తిరిగే కుర్రాడు. తండ్రేమో బ్యాంకులను మోసం చేసి జైలు పాలవుతాడు. తండ్రి బాటలోనే ఇబ్బందుల పాలైన రామ్.. గంగాధర్ (శుభలేఖ సుధాకర్), బసవరాజు (విశ్వేందర్ రెడ్డి) లను అడ్డం పెట్టుకుని అప్పుల ఊబి నుండి బయటపడాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి చెల్లి అవంతి రంగ ప్రవేశం చేయడం తర్వాత ఏం జరుగుతుంది…?కథ ఎప్పుడు సుఖాంతం అవుతందనేదే పచ్చీస్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ప్రధాన తారాగణం నటన, సినిమాటోగ్రఫీ,నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథను చెప్పడంలో తడబాటు,నీరసం తెప్పించే కథనం,ఏ మాత్రం పండని ఎమోషన్స్.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రానికి రచయిత అయిన శ్రీకృష్ణ, నిర్మాతల్లో ఒకరైన రామసాయి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బహుశా మొదటి సారి మెగా ఫోన్ పట్టడం వల్ల కావచ్చు…. కాగితం మీద రాసుకున్న కథను బలంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గా తెరకెక్కించలేకపోయారు. కౌశిక్, రామసాయి నిర్మాతలుగా రాజీపడలేదనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు:
ఓటీటీ వీక్షకులను దృష్టిలో పెట్టుకుని రెండు గంటల నిడివిలోనే మూవీని ముగించినా… మిస్సింగ్ పర్శన్ ను వెతుక్కుంటూ సాగే కథలు
మనకేం కొత్త కాదు. ఇప్పటికే ఇలాంటి సినిమాలను చాలానే చూశాం. అందులో ఈ మూవీ ఒకటి.
విడుదల తేదీ:16/06/2021
రేటింగ్ : 2.25 / 5
నటీనటులు: రామ్
నిర్మాత:కౌశిక్ కుమార్, రామసాయి
దర్శకత్వం: శ్రీకృష్ణ