యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు.
అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి ‘పాంచ్ మినార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. టైటిల్ ఫాంట్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
హీరో రాజ్ తరుణ్ కార్ టాప్ పై రిలాక్స్ అవుతున్నట్లు ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. చెక్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఎనర్జిటిక్ లుక్ లో కనిపించారు రాజ్ తరుణ్. కార్ పై ఓపెన్ చేసి సూట్ కేస్ నుంచి డబ్బు గాల్లోకి ఎగరడం ఇంట్రస్టింగ్ గా వుంది. మోషన్ పోస్టర్ లో ప్రజెంట్ చేసి థీమ్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య జవ్వాది డీవోపీ. ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
Also Read:డ్రింకర్ సాయి..వసూళ్లివే!