విశ్వక్‌ సేన్…పాగల్ ట్రైలర్

126
pagal
- Advertisement -

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ యువ క‌థానాయ‌కుడి లేటెస్ట్ మూవీ ‘పాగల్’. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఇదొక అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌. నరేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పాగల్’ చిత్రంలో విష్వ‌క్ సేన్‌ స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను ‘పాగల్’ సినిమాలో చేస్తున్నారు విష్వ‌క్‌సేన్‌.

- Advertisement -