Owaisi:రిజర్వేషన్లను తొలగించే కుట్ర

14
- Advertisement -

రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు సాధించాలనుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో పతంగీ ఎగురుతుందని, బీజేపీ ఖతం అవుతుందని అన్నారు.

తమ పార్టీ కోసం నల్గొండ గద్దర్ మంచి పాట ఇచ్చారని చెప్పారు. పనితీరును చూసి, గద్దర్ మంచి లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, ఏపీలో పార్టీ ప్రచారం కోసం ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక ఐదేళ్ల పాటు సీఎం రేవంత్ సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదన్నారు. తాను ప్రజల మధ్యనే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పానని….అభివృద్ధి, మతపర శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.

రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారని…బీజేపీ అభ్యర్థి మాధవీలత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన గొడవలు సృష్టించి లబ్దిపొందాలన్నదే మాధవీలత అజెండా అని ఆరోపించారు.

Also Read:ఇంట్లో ఉండే వారికి వడదెబ్బ..జాగ్రత్త!

- Advertisement -