కాంగ్రెస్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

205
asaduddin owaisi
- Advertisement -

కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నిర్మల్ సభకు రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు డబ్బు ఎరగా చూపారని ఆరోపించారు. నిర్మల్‌ సభకు రాకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ఫోన్ చేసి బేరసారాలు ఆడారని కాంగ్రెస్ నేతల ఆఫర్‌కు సంబంధించిన కాల్ రికార్డు తన వద్ద ఉందన్నారు.

తనను ఎవరు కొనలేరని సమయం వచ్చినప్పుడు కాల్ రికార్డులను భయటపెడతానని తెలిపారు. అనైతిక పొత్తులతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకమని మంచి నిర్ణయం తీసుకోని టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు.

ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ఇద్దరూ ఒకేతాను ముక్కలని, ఒక వర్గానికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నాయని ధ్వజమెత్తారు. నిరుపేద ముస్లిం పిల్లల ఉన్నత చదువుల కోసం మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు
విన్నవించిన వెంటనే ఆయన అంగీకరించారని తెలిపారు.

- Advertisement -