- Advertisement -
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అదిరే కౌంటర్ ఇచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.మజ్లిస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బీజేపీకి బీ టీం అని ఆరోపించారు రాహుల్. దీనిపై స్పందించిన ఓవైసీ …ఇక్కడ బీ టీంలు ఉంటే బీజేపీ ఎందుకు బలహీనంగా ఉందని ప్రశ్నించారు.
ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉంటే…సురక్షితమైన సీటు కోసం రాహుల్ బాబా వాయనాడ్ ఎందుకు వెళ్లారని …అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి గెలిచే సీట్ల కంటే తన రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఎక్కువ సీట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు టైం దగ్గర పడుతునన కొద్ది అన్ని రాజకీయ పార్టీలు మాటల యుద్ధాన్ని తీవ్రం చేశాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మరింత హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ – ఓవైసీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
Also Read:పోటీలో బాలయ్యే నెగ్గాడు
- Advertisement -