కాంఛన 3 కథానాయికగా ఒవియా..!

266
- Advertisement -

రాఘవ లారెన్స్ తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా ‘కాంఛన’. సౌత్ ఇండియాలో హార్రర్ కామెడీ జానర్ కు గొప్ప డిమాండ్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇది. ‘ముని’కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన కాంఛన-2 (గంగ) కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ.. లారెన్స్ ఇప్పుడు కాంఛన-3 తీస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే సైలెంటుగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు లారెన్స్.

Oviya to act in Raghava Lawrence's Kanchana 3

ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందని ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది. కానీ ఆమె ప్లేస్ లో ‘ఒవియా’ నటిస్తోందని తెలుస్తోంది. తమిళ బిగ్ బాస్ తో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ‘ఒవియా’ కోసం అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘కాంచన 3’ చేస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

- Advertisement -