మాది బాధ్యత గల ప్రభుత్వం: చంద్రబాబు

11
- Advertisement -

తమది బాధ్యత గల ప్రభుత్వం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన బాబు.. ఏడుగురు ఉన్న ఓ కుటుంబానికి రూ.1 లక్ష ఐదు వేలు తల్లికి వందనం ఇచ్చిన ఘనత టీడీపీది అన్నారు. 64 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్నాం అని తెలిపారు.

గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పెన్షన్లు ఎలా ఇచ్చారో అందరికీ తెలుసు అన్నారు. సింగయ్య కారు కింద పడిపోయాడని తెలిసినా స్పందించరా? చెప్పాలన్నారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా?, కంపచెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా? చెప్పాలన్నారు.

కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా? చెప్పాలన్నారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా? చెప్పాలన్నారు.

Also Read:ప్రధానికి ఘనా అత్యున్నత పురస్కారం

- Advertisement -