రైతులకు మ‌ద్ద‌తుగా ఉంటాం: ఎంపీ సంతోష్

214
mp santhosh
- Advertisement -

వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన బిల్లులు రాజ్యసభలో ఆదివారం తీవ్ర గందరగోళం సృష్టించిన విష‌యం తెలిసిందే. వ్యవసాయ సంబంధిత బిల్లుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బిల్లుల ఆమోద సమయంలో ఆందోళనకు దిగిన 8మంది సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఈరోజు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నిరసనకు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతుల ప్ర‌యోజ‌నాలే మా ల‌క్ష్యమ‌ని, వారికి మ‌ద్ద‌తుగా త‌మ పోరాటం కొన‌సాగుతోంద‌ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాజ్య‌స‌భ‌లో అనైతికంగా ఆమోదించిన అగ్రి బిల్లుల‌ను నిర‌సిస్తూ.. స‌స్పెండ్ చేయ‌బ‌డిన ఎంపీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని ట్వీట్ చేశారు. రైతుల హ‌క్కుల కోసం ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -